telugu navyamedia
సినిమా వార్తలు

వర్మ సర్వే : “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఎఫక్ట్ ఎన్నికలపై పడుతుందా ?

Laxmis NTR movie compliant CEC

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 22న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ఈ నేపథ్యంలోనే వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ సర్వేను నిర్వహించారు. ఆ సర్వేలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా ?” అని ప్రశ్నించారు. ఈ పోలింగ్ లో 35,700 మంది పాల్గొన్నారు. అందులో “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఏపీ ఎన్నికలకు ప్రభావితం చేస్తుందని 72 శాతం నెటిజన్లు అంగీకరించారు. ఎలాంటి ఫలితం చూపదంటూ 28 శాతం నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో టీడీపీ అధినేత చంద్రబాబును నెగటివ్ గా చూపిస్తున్నారని, తొలివిడత పోలింగ్ ముగిసే వరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. వర్మ మాత్రం తాను చచ్చినా ఈ సినిమా విడుదల అవుతుందని, ఒకవేళ వెండి తెరపై విడుదల చేయనీయకపోతే యూట్యూబ్ లో విడుదల చేస్తానని స్పష్టం చేశారు. మరేం జరుగుతుందో చూడాలి.

Related posts