telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిఖిల్ ఎవడో నాకు తెలీదు… వీళ్లంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తులు… వర్మ సంచలన వ్యాఖ్యలు

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సెటైరికల్ మూవీ ‘పవర్ స్టార్’పై జనసేనాని అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఆయనపై ‘పరాన్నజీవి’ అనే సినిమాను పవన్ అభిమానులుగా చెప్పుకుంటోన్న కొంతమంది రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మను ఉద్దేశించి కుక్క అంటూ యంగ్ హీరో నిఖిల్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ లేని విధంగా నిఖిల్ ట్వీట్‌ను 13 వేల మంది రీట్వీట్ చేశారు. అయితే, నిఖిల్ చేసిన వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ లైవ్‌ ఇంటర్వ్యూలో వర్మ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ వ్యాఖ్యల గురించి యాంకర్ ప్రస్తావించారు. స్పందించిన వర్మ ‘‘నిఖిల్ కావచ్చు, కిఖిల్ కావచ్చు.. వాళ్లంతా ఒకే కోవకు చెందినవాళ్లు. వీళ్లంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తులు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌కు వీళ్ల మీద మంచి అభిప్రాయం వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఎవడో నాకు తెలీదు. ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ నాకు తెలీదు’’ అని వర్మ వ్యాఖ్యానించారు.

Related posts