telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ  మళ్ళీ రచ్చ మొదలు పెట్టాడు

RGV
 లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 22 న విడుదలవుతుందా ?అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సరిగ్గా ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేసి  చంద్ర బాబు నాయుడు ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని, వై సి పి కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి ప్రయోజనం చేకూరేలా చెయ్యాలని  మాస్టర్ ప్లాన్ వేశారు . 
ఇప్పుడు ఈ ప్లాన్ బెడిసి కొట్టేలా కనిపిస్తుంది . అన్నివైపులా నుంచి సమస్యలు వర్మను చుట్టుముట్టాయి . ఒకవైపు చంద్ర బాబు అభిమాని దేవీబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు . ఈ సినిమాలో చంద్ర బాబును విలన్ గా చూపించాడు, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ చిత్రించాడు , కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల చెయ్యకుండా చర్యలు తీసుకొమ్మని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు . 
దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదును రాష్ట్ర సంఘానికి పంపినట్టు తెలుస్తుంది . ఎన్నికల కోడ్  అమలులోకి రాగానే ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడగమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది . అలాంటప్పుడు ఎన్టీఆర్ సినిమాను ఎలా అనుమతి ఇస్తారనేది తెలుగు తమ్ముళ్ల వాదన. ఇంకోవైపు ఎన్టీఆర్ కుమారులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తమ అనుమతి లేకుండా సెన్సార్ చెయ్య వద్దని కేంద్ర సెన్సార్ అధికారి ప్రసూన్ జోషికి లేఖలు రాశారు . 
ఈ సినిమా ఆంధ్ర లో విడుదల చెయ్యడానికి ఎవరు ముందుకు రావడం లేదని అందుకే స్వంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది . ఈసినిమా విడుదల కాకుండా అన్ని ప్రయత్నాలు తెలుగు దేశం నాయకులు చేస్తున్నారు . ఒకవేళ పొరపాటున  చంద్ర బాబు నాయుడు మీద కేంద్రం కక్ష్య సాధించడాని సెన్సార్ కు అనుమతి ఇచ్చినా ఆంధ్రాలో థియేటర్లలో  విడుదల చెయ్యడానికి చాలా మంది యజమానులు ముందుకు రాక పోవచ్చు చంద్ర బాబును అప్రదిష్ట పాలు చెయ్యడానికికి రామ్ గోపాల్ వరం వై సి పి తో చేతులు కలిపాడని అర్ధమవుతుంది . కాబట్టి థియేటర్ లలో విడుదలయితే  సినిమా ఆడకుండా దాడి చెయ్యాలనే ఆలోచనతో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్టు తెలుస్తుంది . 
అందుకే తమ థియేటర్ లను ఇవ్వడానికి ఎక్కువ శాతం ముందుకు రాక పోవచ్చునని తెలుస్తుంది . ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల రెడీ అవుతుంది . రెండు రోజుల్లో సెన్సార్ కు వెడుతుంది .సినిమా ఇబ్బందుల్లో పడుతుందని తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు టీవీ చానెల్స్ లో మరింత రచ్చ చేయడం మొదలు పెట్టాడు . 
మొదటి నుంచి తన సినిమాలను కాంట్రవర్సీ చేయడం వర్మ అలవాటు  . ఇప్పుడు ఈ సినిమా వివాదంలో పడుతుందని గ్రహించి చంద్ర బాబును టార్గెట్ చేస్తూ రాజాకీయ కమిట్మెంట్ లేదని చెబుతూనే రాజకీయ ప్రయోజనం కోసం పోరాడుతున్నాడు . ఈ సినిమా నిర్మాణం వెనుక వై .సి .పి  పాత్ర ఉందని అందరికీ తెలుసు . ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కోసం కూడా తెర వెనుక ప్రయత్నాలు బాగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది . వర్మ ఇప్పుడు అయోమయంలో పడిపోయాడనేది ఆయన మాటలను బట్టి తెలుస్తుంది . 

Related posts