telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీకు ఆఫర్ ఇవ్వడానికి నేను రెడీ… మరో యాంకర్ కు వర్మ ఆఫర్

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వారానికో సినిమా ప్రకటిస్తూ వాటిని ప్రమోట్ చేయడానికి కూడా సరైన మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. కాస్త పేరున్న యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు చేస్తూ వర్మ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఆ ఇంటర్వ్యూలలో కూడా తన సినిమా కంటెంట్‌ని కాకుండా తనని ప్రశ్నలడిగే యాంకర్‌పైనే ఆయన దృష్టి పెట్టి.. ఏదో రకంగా క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు. ఈ మధ్య వర్మ యూట్యూబ్ ఛానెల్ యాంకర్స్‌కు ఎలా గాలం వేస్తున్నాడో తెలియంది కాదు. తాజాగా మరో యాంకర్‌ను ఆయన బుట్టలో పడేసే ప్రయత్నం చేశాడు. ‘‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. వచ్చేయ్ సినిమాల్లోకి. ఎనీటైమ్.. నీకు ఎప్పుడు నటించాలని అనిపిస్తే అప్పుడు నన్ను కాంటాక్ట్ చెయ్. నువ్వు మాములుగా లేవు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా నువ్వు చాలా అందంగా ఉన్నావు.. కెమెరా ముందు సీరియస్‌గా చెబుతున్నా.. నీకు ఆఫర్ ఇవ్వడానికి నేను రెడీ..’’ అంటూ తనని ఇంటర్వ్యూ చేస్తున్న చందన అనే యాంకర్‌కు వర్మ ఆఫర్ ఇచ్చాడు. వర్మ చెప్పినట్లుగా ఆ యాంకర్ కూడా అందంగానే ఉందనుకోండి. అయితే ఇదే విషయం తనని ఇంటర్వ్యూ చేసిన ప్రతి యాంకర్‌కు వర్మ చెబుతున్న మాటే. యాంకర్ చందన కూడా ఇదే విషయం వర్మని అడిగింది. కానీ వర్మకి ఆడవాళ్లు అయితే చాలు.. అందంగానే కనిపిస్తారుగా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడీ ఇంటర్వ్యూతో వర్మ వెబ్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.

Related posts