telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధాని దీపాలు వెలిగించమంటే… వర్మ ఏమి వెలిగించాడో తెలుసా

varma

ఆదివారం ప్రధాని పిలుపు మేరకు రాత్రి 9 గంటలు 9 నిమిషాలు దీప జ్యోతులు వెలిగించమంటే దేశ ప్రజలంతా ఆయన సందేశం మేరకు దీపాలు, ఫ్లాష్ లైట్లు, క్యాండిల్స్ వెలిగించారు. అయితే వర్మ మాత్రం రాత్రి 9 గంటలకు అందిరలా కాకుండా చాలా స్పెషల్ గా చేశాడు. దీపాలు, క్యాండిల్స్ కాకుండా ఆయన వెరైటీగా సిగరెట్ వెలిగించాడు. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు వర్మ. వర్మ చేసిన ఈ పనిపై నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. తిక్క మామూలుగా లేదంటూ ఓ నెటిజన్ విమర్శించాడు. మరో నెటిజన్ 9 నిమిషాలు అలాగే ఉంచాలన్నాడు. అయితే ప్రతి దాన్ని కాంట్రవర్సి చేయడం వర్మకు అలవాటే. అలా అందరి నోళ్లలో నానాలనుకుంటాడు. సిగరెట్ వెలిగించిన వర్మ ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు సిగరెట్ తాగడంపై ప్రభుత్వ హెచ్చరికను పాటించకపోవడం కన్నా కరోనా గురించి ప్రభుత్వ హెచ్చరిలకు పాటించకపోవడం చాలా ప్రమాదకరమని అన్నారు. దీపాల వెలిగించడం లో కూడా సిగరెట్ తో లింక్ పెట్టి ప్రజల మీద సెటైర్ వేశాడు.

Related posts