telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమ్మరాజ్యంలో కడప రెడ్లు : “పప్పులాంటి అబ్బాయి” పాటకు వర్మ చిందులు

Ram-Gopal-Varma

వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం “క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుండ‌గా, చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్ తో వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ. ఇటీవ‌ల కేఏపాల్‌కి సంబంధించిన స్పెష‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేయ‌గా, తాజాగా ఆయ‌న మ‌రో పాట‌ని విడుద‌ల చేశారు. “పప్పులాంటి అబ్బాయి” అంటూ సాగే ఈ పాట ఫ‌స్ట్ పార్ట్‌లో తండ్రి ప‌డే బాధ‌, సెకండ్ పార్ట్‌లో కొడుకు ప‌డుతున్న బాధ‌ల‌ని చూపించారు. అంతేకాదు పాటలో సైకిల్ గురించి, తాతనుండి సైకిల్ లాగేసున్న విధానం గురించి, పార్టీకి భాద్యత వహించాల్సిన వ్యక్తుల గురించి చ‌ర్చిస్తూ విజువల్స్‌తో ఆసక్తిగా చూపించారు. పప్పులాంటి అబ్బాయి పాత్ర ఏపీలోని ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిని ఉద్దేశించినట్లు కనిపిస్తోందని చ‌ర్చించుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోగా, సినిమా యూనిట్ మొత్తం కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో పప్పులాంటి అబ్బాయికి వర్మ స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts