telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్న రామ్

Ram

టాలీవుడ్ చాక్లెట్ బోయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని అరుదైన రికార్డును అందుకున్నారు. రామ్‌కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ విషయాన్ని ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా రుజువు చేసింది. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వచ్చిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ డిజిటల్ రైట్స్‌ను ఆదిత్య మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో ‘దుందార్ ఖిలాడీ’గా అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో ఈ సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేయగా ఇప్పటి వరకు 140 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో అతివేగంగా 1 మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక సౌతిండియన్ సినిమాగా ‘దుందార్ ఖిలాడీ’ నిలిచింది. రామ్ కెరీర్‌లో ఎన్నో వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100 మిలియన్‌ల వ్యూస్‌ని అందుకోగా, ఆ సినిమా హిందీ వర్షన్ 140 మిలియన్ల వ్యూస్‌ని దాటేసింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిందీ డబ్బింగ్ వర్షన్ ‘నెంబర్ 1 దిల్ వాలా’ కూడా 1 మిలియన్ లైక్స్‌కి అతి దగ్గరలో ఉంది. ‘హైపర్’, ‘శివమ్’ సినిమాలు కూడా హిందీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

Related posts