telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శంకర్, రామ్ చరణ్ తో దిల్ రాజు మూవీ

దర్శక ధీరుడు రాజమౌళితో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాంచరణ్ ప్రస్తుతం. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో చేయనున్నాడు. ఇందులో దాదాపు నలభై నిమిషాల నిడివి ఉన్న పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రాంచరణ్ ఆచార్య షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా ఆచార్య టీం విడుదల చేసింది. ఇందులో చెర్రీ సిద్ద అనే పాత్రలో చేయనున్నాడు.  ఇది ఇలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న న్యూస్ ని అధికారికంగా ప్రకటించింది దిల్ రాజు సంస్థ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నట్టు తెలిపింది. ఇది దిల్ రాజు సంస్థలో 50వ చిత్రం కావడం విశేషం. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుపుతూ షోమేన్ ఆఫ్ ఇండియన్ సినిమా దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి రెండు శక్తుల కలయికలో ఇంతకు ముందు ఎవరూ చూడని స్థాయిలో సినిమాను నిర్మించబోతున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ట్విట్టర్ లో తెలిపారు. 

Related posts