telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొరటాల సినిమాలో చిరుతో చరణ్ ?

ram charan with saira narasimhareddy photo viral

కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా చిరంజీవి 152వ చిత్రం విజయ దశమి రోజున కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఈ సెట్స్ పై వెళ్లనుంది. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహారెడ్డి” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా, డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమచారం. మరోవైపు నక్సలైట్ క్యారెక్టర్‌ కూడా చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఆ పాత్రలో చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్టు సమాచారం. సినిమాలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గెస్ట్ రోల్ కాకుండా సినిమాలో కీలకమైన పాత్రలోనే చరణ్ నటించబోతున్నాడట. చిరంజీవి యంగ్ వెర్షన్‌గా చెర్రీ కనిపించబోతున్నాడట. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చెర్రీ కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts