telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆచార్య : చిరు, చరణ్ ల మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్ ?

Chiru

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న తెలిసిన విషయమే. అలాగే ఈ చిత్రంలో మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ ఒక 25 నిమిషాల వ్యవధి వరకు కనిపిస్తారని ఎప్పటి నుంచి వినిపిస్తున్న టాక్. అయితే ఈ పావుగంటలో చరణ్ సీన్స్ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వనున్నాయని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో చరణ్ పరిచయం అయ్యి, గూస్ బంప్స్ ఇస్తారట. అలాగే చిరు మరియు చరణ్ ల మధ్య ఒక అదిరిపోయే సాంగ్ సహా ఓ బ్లాస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయింది. కానీ కరోనా తరువాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Related posts