telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ డైరెక్టర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ?

RC

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అని ఇప్పటికే ప్రకటించాడు. కానీ చరణ్ మాత్రం తన తర్వాతి సినిమా అనౌన్స్ చెయ్యలేదు. తాజా సమాచారం ప్రకారం మెగాపవర్ స్టార్ ను ఓ యువ దర్శకుడు మెప్పించాడట. ‘ఛలో’ సినిమా తో దర్శకుడిగా అడుగు పెట్టి తాజాగా నితిన్ తో ‘భీష్మ’ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ దర్శకుడు ఇప్పుడు చరణ్ కు ఓ స్టోరీ వినిపించాడని తెలుస్తుంది. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి చరణ్ ఆసక్తిని చూపించారని సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్‌ గురించి స్పష్టత వస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది తెలియాల్సి ఉంది.

Related posts