telugu navyamedia
సినిమా వార్తలు

సైరా : ఉయ్యాలవాడ వారసుల నిరసనపై చరణ్ స్పందన

chi

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

ఇటీవల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చిత్ర నిర్మాణ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ చిరంజీవి ఆఫీసు ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై రామ్ చరణ్.. సైరా నరసింహారెడ్డి ట్రైలర్‌ లాంఛ్ కార్యక్రమంలో స్పందించాడు. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ధర్నా విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ… “సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 100 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్ర కిందకు వెళ్లిపోతుంది. దాన్ని సినిమాగా ఎవరైనా వాళ్ల గౌరవానికి భంగం కలగకుండా తెరకెక్కించవచ్చని చెప్పుకొచ్చారు. మంగళ్ పాండే జీవిత చరిత్రను తెరకెక్కించేటపుడు చరిత్రలో 65 ఏళ్ల లిమిట్ ఉంటే చాలని సుప్రీంకోర్డు తీర్పు చెప్పింది. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… దేశం కోసం ఉయ్యాలవాడ అనే ప్రాంతం కోసం పోరాడారు. ఏమైనా సాయం చేయాలంటే ఆ ఊరు కోసమో… జనాల కోసమో చేస్తాను. నలుగురు వ్యక్తులకో కుటుంబానికో మాత్రం సపోర్ట్ చేయను. అలా చేసి మహాత్ముడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాయిని తగ్గించను” అని చెప్పుకొచ్చారు.

Related posts