telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మా” వివాదంపై స్పందించిన రామ్ చరణ్

Ram-Charan

ఇటీవల ‘మా’లో చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణ సభలో అధ్యక్షుడు నరేష్ తీరుపై వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి పెద్దలంతా రాజశేఖర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. అనంతరం రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించాడు. నేడు చెర్రీ విజయవాడ బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్ ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా చెర్రీ ‘మా’ వివాదంపై స్పందించాడు. “సినీ రంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారు. మా అసోసియేషన్‌లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారు” అని తెలిపాడు.

Related posts