telugu navyamedia
telugu cinema news

“ఇస్మార్ట్ శంకర్”కు రామ్ చరణ్ ప్రశంసలు

Ram-Charan

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంక‌ర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంక‌ర్” చిత్రంలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. జూలై 18న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ తొలి రోజే ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ సాధించింది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. చాలా రోజుల త‌ర్వాత ఇటు పూరీకి ఇటు రామ్‌ ఖాతాలో “ఇస్మార్ట్ శంక‌ర్”తో హిట్ పడింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన “ఇస్మార్ట్ శంక‌ర్” ఓవర్సీస్ తప్పించి.. మిగిలిన అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ నటనను అందరు మెచ్చుకుంటున్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రముఖ హీరో రామ్ చరణ్ ఫేస్‌బుక్ వేదికగా ప్రశంసల ఝల్లు కురిపించాడు. అంతేకాదు దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు.. రామ్ నటనను మెచ్చుకుంటూ వాళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో చెర్రీ పోస్ట్ చేసాడు. చరణ్ ప్రశంసలపై రామ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ధన్యవాదాలు సోదరా…” అని పోస్ట్ చేసాడు. ఇక హీరోగా రామ్ చరణ్.. పరిచయం అయింది కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “చిరుత” సినిమాతోనే.

Related posts

తెలుగు విలన్ సిక్స్ ప్యాక్.. పిక్ వైరల్

vimala p

వేణు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు: చిరంజీవి

vimala p

సినిమా కోసం లైఫ్ రిస్క్ చెయ్యను : రకుల్

vimala p