telugu navyamedia
news telugu cinema news

వైరల్ అవుతున్న ఆచార్య సెట్ లోని చరణ్ ఫోటో…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 40నిమిషాల నిడివి ఉన్న పాత్రతో చెర్రీ అందరినీ ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, చరణ్‌కు జోడీగా పూజా హెగ్దె నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో చిరు, చెర్రీ ఇద్దరూ పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్యే భారీ యాక్షన్ షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయిందంట. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా పాత్రలో కనిపిచంనున్నారు. అయితే తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు కొరటాల. దీనికి రామ్ చరణ్ ”కామ్రేడ్‌ మూమెంట్‌” అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ‘ఆచార్య’ సెట్‌లో ప్రతి క్షణాన్ని నాన్నతో, కొరటాలతో ఎంజాయ్‌ చేస్తున్నాను తెలిపాడు. అయితే ఈ ఫొటోలో చరణ్ భుజం పై చిరు చేయి కనిపించగా వారి ముందు ఓ గన్ ఉంది. ఇక ఈ సినిమా మే13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అభిమానుల అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మరి ఆచార్య అభిమానులను అనుకున్నంత స్థాయిలో అలరిస్తారేమో వేచి చూడాలి.

Related posts

హాలీవుడ్ వైపు చూస్తున్న .. అనుష్క.. పెళ్లి చేసుకోమంటున్న తల్లిదండ్రులు.. !

vimala p

మానిష్‌ పాండే వివాహం .. విరాట్‌ కోహ్లిసేన శుభాకాంక్షలు…

vimala p

ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు: మంత్రి అవంతి

vimala p