telugu navyamedia
సినిమా వార్తలు

“రియ‌ల్ చిరుత‌తో రీల్ చిరుత”… చెర్రీ సాహసం

Ram-Charan

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన యాక్ష‌న్ సన్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో చ‌ర‌ణ్ గాయ‌ప‌డడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం పూర్తిగా కోలుకున్న రామ్ చరణ్ త‌న భార్య‌తో క‌లిసి ఆఫ్రికాలో వైల్డ్ లైఫ్ సఫారీ చేస్తున్నాడు చెర్రీ. ఈ క్ర‌మంలో టాంజానియా లోని సెరిగేటి నేషనల్ పార్కులో చిరుత‌ని చాలా ద‌గ్గ‌ర‌గా ఫోటో తీసాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… “రియ‌ల్ చిరుత‌తో రీల్ చిరుత” అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ టూర్ త‌ర్వాత చెర్రీ తిరిగి “ఆర్ఆర్ఆర్” చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో కనిపించనున్నాడు.

Ram-charan-and-Upasana

Related posts