telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిగ్గుపడి బాలీవుడ్ లో రెండో ప్రయత్నం చేయలేదా… రామ్ చరణ్ కు మీడియా ప్రశ్న

Ram-Charan

టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు రామ్ చరణ్‌. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్. కాగా ఆరేళ్ల కింద బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. 2013లో ఈయన “జంజీర్” సినిమాతో హిందీ ఇండస్ట్రీకి వెళ్లాడు. అక్కడ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. అంతేకాదు భారీగా విమర్శలను కూడా మూటగట్టుకున్నాడు రామ్ చరణ్. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈయన బాలీవుడ్ వైపు అడుగులేయలేదు. ఇన్నేళ్ళ తర్వాత తన బాలీవుడ్ సినిమాపై మరోసారి స్పందించాడు చరణ్. తాజాగా “సైరా” టీజర్ లాంఛ్ వేడుకలో చరణ్‌ను బాలీవుడ్ మీడియా ఈ ప్రశ్న అడిగింది. హీరోగా రెండో ప్రయత్నం ఎందుకు చేయలేదు.. ఒక్క సినిమాతోనే సిగ్గుపడి ఆగిపోయారా ? అంటూ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు రామ్ చరణ్. “సిగ్గుపడి కాదు.. కంటెంట్ కరెక్టుగా ఉంటే ఇక్కడ నటించడానికి తనకేం సమస్య లేదని చెప్పుకొచ్చాడు. అంతా కథపైనే ఆధారపడి ఉంటుందని.. వచ్చే ఏడాది రాజమౌళి RRR సినిమాతో మళ్లీ హిందీకి వస్తున్నాను” అని చెప్పాడు చరణ్. ఈ సినిమాతో మళ్లీ తను బాలీవుడ్‌లో నిరూపించుకుంటానని చెబుతున్నాడు.

Related posts