• Home
  • వార్తలు
  • ఉపాసన పెట్టిన ట్వీట్ వైరల్…! ఫొటోలో అల్లు అయాన్ తో పాటుగా మరికొందరు చిన్నారులు
Trending Today వార్తలు సినిమా వార్తలు

ఉపాసన పెట్టిన ట్వీట్ వైరల్…! ఫొటోలో అల్లు అయాన్ తో పాటుగా మరికొందరు చిన్నారులు

Ram Charan on Mama Duty Allu Ayaan waiting to eat Cake

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు అభిమానులకు చేరవేసే ఉపాసన తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది… టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘రంగస్థలం’ సినిమా తరువాత మరో మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న చెర్రీ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి మరి ఎంతో ఘనంగా జరిపించాడు.. ఈ విషయాన్నీ అతని భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది…

“మామ డ్యూటీస్… అంటూ కిస్ ఎమోజీ పెట్టి హ్యాపీ బర్త్ డే” చెబుతూ చెర్రీ తన మేనకోడలితో కేక్ కట్ చేయిస్తూ ఉన్న ఫోటోను జతచేసింది.. కాగా ఈ ఫొటోలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ తో పాటుగా మరికొందరు చిన్నారులుండగా అయాన్ కేక్ వైపే తదేకంగా చూస్తున్నట్టు కనిపిస్తుండగా… మెగా, బన్నీ అభిమానులంతా… అల్లువారబ్బాయి దృష్టాంతా కేక్ పైనే ఉందంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది..

Related posts

హరికృష్ణ అకాల మృతికి “దేవదాస్, పందెంకోడి-2” నివాళి

vimala t

“కొబ్బరిమట్ట” ప్రోమో వచ్చేసింది… సంపూర్ణేష్ ఆన్ ఫైర్

vimala t

శివాని "2 స్టేట్స్" ప్రారంభం

admin

Leave a Comment