telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కొరటాల శివతోనే తన తదుపరి ప్రాజెక్ట్ .. రామ్ చరణ్

ram charan next project with koritala siva

ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. తన తండ్రితో ఆయన నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసే చిత్రాన్ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేయబోయే చిత్రం ఏ దర్శకుడితో ఉండబోతుంది అనేది తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చరణే స్వయంగా తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివతో తన తదుపరి చిత్రం ఉండనుందని, వాస్తవానికి ఇప్పటికే కొరటాలతో సినిమా చేయాల్సి ఉందని చరణ్ తెలిపారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీ అవ్వడం, ఈలోపు కొరటాల కూడా చిరుతో చేయాలనేది తన డ్రీమ్‌గా చెప్పడంతో చిరు 152వ చిత్ర అవకాశం కొరటాలకు ఇవ్వడం జరిగిందని చరణ్ తెలిపారు. సో.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయే చిత్రంపై ఓ క్లారిటీ వచ్చేసినట్లే.

Related posts