telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మెగాస్టార్ ది లెజెండ్ బుక్’ లాంచ్ లో చరణ్ ఎమోషనల్ స్పీచ్

Ram-Charan

మెగాస్టార్ చిరంజీవి పేరు మీద బుక్ రాసిన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీ ఆదివారం ఈ బుక్‌ని టాలీవుడ్ పెద్దల సమక్షంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. ‘మెగాస్టార్ ది లెజెండ్ బుక్’ కార్యక్రమం ది పార్క్ హయత్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికే చిరంజీవి మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి ఎందరో సూపర్ స్టార్స్ ఉన్న సమయం నుంచి అంచెలంచెలుగా స్వశక్తితో ఎదుగుతూ వచ్చారు చిరంజీవి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న చిరు మీద.. ‘మెగాస్టార్ ది లెజెండ్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తాజాగా ఓ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆయన గురించి చెప్పాలంటే.. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకి ముందు.. ఆ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే.. మా చిన్నప్పుడు ఆయన్ని చూసింది.. మాట్లాడింది చాలా తక్కువ. మేము లేవకముందే వెళ్లిపోయేవారు.. మేము పడుకున్నాకే వచ్చేవారు. అంతలా ఆయన కష్టపడేవారు. అప్పుడు మాకు తెలిసేది కాదు. కానీ నాన్నతో ‘ఖైదీ నెంబర్ 150’ చేశాకే.. అర్థమయ్యింది. ఆయన మా కోసం ఎంత కష్ట పడ్డారన్నది. 64 ఏళ్ల వయస్సులో కూడా.. రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. ఆయన సైరా సినిమా చేశారు. ఆయన గురించి నాకు ఎన్నో తెలుసు అనుకున్నా.. కానీ.. నాకు చాలా కొంతనే తెలుసు. కనీసం ఈ బుక్ చదివిన తర్వాత.. నాన్నకి ఇంకా దగ్గర అవుతా అనుకుంటున్నా. మా అమ్మని, మమ్మల్ని దగ్గర పెట్టుకుని ఒకటే చెబుతూంటారు. ఇప్పుడు మీతో ఎక్కువ సమయం గడపాలని ఉందని. అందుకే అన్ని సెలబ్రేషన్స్ ఇంటిలోనే చేసుకుంటున్నామని చెప్పాడు చెర్రీ. కాగా ఈ కార్యక్రమంలో.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, బి సుబ్బిరామి రెడ్డి, అల్లు అరవింద్, వివి వినాయక్, రామ్ చరణలు తదితరులు పాల్గొన్నారు.

Related posts