వార్తలు సినిమా వార్తలు

మామ డ్యూటీ ఎక్కిన రామ్ చరణ్ …

Ram Charan doing uncle's duties

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన భర్తకు సంబంధించిన షూటింగ్ విషయాలనే కాదు.. పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం షూటింగ్‌కు విరామం ఇచ్చిన మెగా పవర్ స్టార్ తన సమయాన్నంతా కుటుంబంతోనే సరదాగా గడిపేందుకు వెచ్చిస్తున్నాడు.


 

నిన్న(గురువారం) భార్యతో కలిసి డ్రైవ్‌కి వెళ్లిన చెర్రీ… సాయంత్రం మామగా డ్యూటి నిర్వహించారట. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ ద్వారా తెలిపారు. తన మేనకోడలితో చెర్రీ కేక్ కట్ చేయించే పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఉపాసన.. ‘మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే’ అని ట్వీట్ చేశారు. ఆ పిక్‌లో చెర్రీ మేనకోడలితో పాటు అల్లు ఆయాన్, మరికొందరు చిన్నారులు కనిపిస్తున్నారు. అయితే ఆ పిక్‌లో ఆయాన్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాడు. కేక్‌నే చూస్తున్న ఆయాన్‌ను చూసి ‘అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌పైనే ఉంది’ అంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.

Related posts

పవన్ నిరసన దీక్షలో అభిమానులు "సీఎం" అంటూ కేరింతలు

admin

హరికృష్ణ సినీ ప్రస్థానం…’సీతయ్య’ ఎవరి మాటా వినడు…

chandra sekkhar

తిరుమల తిరుపతి దేవస్థానం

jithu j

Leave a Comment