telugu navyamedia
సినిమా వార్తలు

యంగ్ టైగర్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్

Ram Charan images

నేడు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా “హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్” హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1983లో మే 20న జన్మించిన తారక్ ఈ పుట్టినరోజుతో 36వ యేడులోకి అడుగుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “ఆయురారోగ్యాలతో, సంతోషంగా, జీవితంలో విజయం సాధించాలని కోరకుంటున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న #RRR సినిమాలో వీరిద్దరూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Related posts