telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్”కు కష్టాలు… పూరీ వల్లే…!

ismart sankar shooting started

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. “డబుల్ ధమాకా దిమాక్” అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమా లో కనిపించనున్నారు. కాస్ట్యూమ్స్ కూడా రామ్ పాత్ర కు తగిన విధంగా వైవిధ్యంగా ఉండడం విశేషం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిధి అగర్వాల్, నాభా నటేష్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే లుక్ మార్చిన రామ్ ఇప్పుడు కండలు కూడా పెంచుతున్నాడు. జిమ్ లో రెస్ట్ లేకుండా వర్కవుట్స్ కండలు పెంచేస్తున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related posts