telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రెడీ” బ్యూటీ క్యూటెస్ట్, బెస్టెస్ట్ అంటున్న ఇస్మార్ట్ శంకర్

Ram

తెలుగులో సత్యం, సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న బ్యూటీ జెనీలియా. 2003లో వచ్చిన “తుజే మేరీ కసమ్” హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన జెనీలియా ఆ తరువాత పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో దగ్గుబాటి రానా నటించిన చిత్రం “నా ఇష్టం” చివరిది. 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్నాక ఆమె సినిమాలు చేయడం తగ్గించారు. ప్ర‌స్తుతం పిల్ల‌లు, సంసారం చూసుకుంటూ జీవితాన్ని గ‌డిపేస్తుంది జెనీలియా. ఇక ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పొతినేని, గాడ్జియ‌స్ బ్యూటీ జెనీలియా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం “రెడీ”. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. రెడీ త‌ర్వాత రామ్‌, జెనీలియా క‌లిసి ఏ సినిమా చేయ‌క‌పోయిన వారి మ‌ధ్య ఫ్రెండ్షిప్ మాత్రం ప‌దిలంగానే ఉంది. జెనీలియా ప్ర‌తి బ‌ర్త్‌డేకి విషె చేసే రామ్ ఈ సారి జెనీలియాని స్వ‌యంగా క‌లిసి విషెస్ చెప్పాడు. అంతేకాదు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌తో క‌లిసి దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “స్వీటెస్ట్‌, క్యూటెస్ట్, బెస్టెస్ట్ జెనీలియాకి బ‌ర్త్‌డే విషెస్‌. ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను” అని రామ్ తెలిపాడు. జెనీలియా 1987 ఆగస్టు 5న ముంబైలో జన్మించారు. ప్రస్తుతం రామ్ “ఇస్మార్ట్ శంక‌ర్” సినిమా స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

READY 2 Already !!!! @geneliad @ram_pothineni

A post shared by Riteish Deshmukh (@riteishd) on

Related posts