• Home
  • Trending Today
  • “ఎన్టీఆర్”లో శ్రీదేవికి కోటి… ఆకట్టుకోలేకపోయిన రకుల్…
Trending Today సినిమా వార్తలు

“ఎన్టీఆర్”లో శ్రీదేవికి కోటి… ఆకట్టుకోలేకపోయిన రకుల్…

rakul-preeth

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ‘బయోపిక్’ క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండగా, చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యా బాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తొలిభాగాన్ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’గా, రెండో భాగాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రూపొందిస్తున్నారు. అంతేకాదు ఆ రెండు భాగాల విడుదల తేదీని కూడా ప్రకటించారు. 9 జనవరి 2019న మొదటిభాగం, 24 జనవరి 2019 రెండో భాగం విడుదలవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

నిన్ననే చిత్రబృందం ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ లుక్ ని విడుదల చేసింది. “ఆకుచాటు పిందె తడిచే…” సాంగ్ లో శ్రీదేవి కట్టు, బొట్టు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు అచ్చం అలాంటి కాస్ట్యూమ్స్ తో ఉన్న రకుల్ గెటప్ ని విడుదల చేశారు. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో హిట్ సినిమాలు వచ్చాయి. అందువలన “ఎన్టీఆర్ కథానాయకుడు”లో శ్రీదేవి పాత్ర కనిపించనుంది. మొత్తం మీద రకుల్ పాత్ర నిడివి 20 నిమిషాల లోపు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర నిమిత్తం పారితోషికంగా రకుల్ కి కోటి రూపాయలు ముట్టజెప్పారట. ఇక శ్రీదేవిగా రకుల్ లుక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే విమర్శలు బాగా విన్పిస్తున్నాయి. మరి నటన పరంగానైనా రకుల్ శ్రీదేవిని గుర్తుకుతెస్తుందా ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Related posts

అమితాబ్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన తండ్రి…!

vimala t

“ఎన్టీఆర్” బయోపిక్ లో ఆ పాత్ర చేయనంటున్న నాగబాబు

vimala t

3డి ని మించిన థియేటర్ లు…సినిమాలోకి వెళ్ళొచ్చేయొచ్చు..

chandra sekkhar

Leave a Comment