telugu navyamedia
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా రకుల్ ?

Rakul

రకుల్‌ ప్రీత్‌కి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ కోలీవుడ్ స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా సందడి చేయబోతోందట. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాదిలో ఇప్పటికే “యన్టీఆర్ కథానాయకుడు”, “దేవ్”, “దే దే ప్యార్ దే”, “ఎన్జీకే” చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన రకుల్… ప్రస్తుతం తెలుగులో “మన్మథుడు-2”, హిందీలో “మార్జవాన్”తో పాటు తమిళంలో శివకార్తికేయన్ మూవీలోనూ నటిస్తోంది. ఈ సినిమాలన్నీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌కి తాజాగా కోలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని సమాచారం. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా సమంత పేరు వినిపిస్తుండగా మరో నాయికగా రకుల్ ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. మరి… బ్లాక్ బస్టర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విజయ్ పక్కన రకుల్ ఏ మేరకు అలరిస్తుందో చూద్దాం.

Related posts