telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రకుల్ అందాల ఆరబోత.. !అవకాశాలు కరువైనా .. ఎక్కువైనా.. ఆరబోస్తారే..!!

rakulpreetsingh hot photo shoot

రకుల్ ప్రీత్ సింగ్ కొత్తల్లో యూత్ కి తెగ కనెక్ట్ అయింది. ఆమెతో మూవీస్ చేయాలని స్టార్ హీరోలు సైతం వెయిట్ చేసేవారు. ఆమె అందం, అభినయం ఆహా ఒహో అంటూ కీర్తించేవారు. యంగ్ హీరోలు వరసగా ఆమెతో నటించి హిట్లు కొట్టాక ఇక చాలనుకున్నారు. అదే టైంలో ఆమె చేసిన కొన్ని మూవీస్ ఫట్ కావడంతో అమ్మడు జాతకం ఒక్కసారిగా తిరగబడిపోయింది. రెండేళ్ళ క్రితం నుంచి రకుల్ కెరీర్ సరిగ్గా లేదు. మహేష్ బాబు తో స్పైడర్ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయింది.

దానితో రకుల్ ని మెల్లగా పక్కన పెట్టేయడం మొదలుపెట్టారు. మరో వైపు తమిళ్, హిందీ అంటూ రకుల్ ఎన్ని కబుర్లు చెప్పినా అక్కడ కూడా ఏమంత బాగోలేదు. టాలీవుడ్లో అయితే ఆమెకు నాగ్ మూవీ తప్ప మరోటి లేదు. లేటెస్ట్ గా సూర్యతో చేసిన ఎంజీకే మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దానితో రకుల్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అన్న మాట వినిపిస్తోంది. ఈ మూవీలో రకుల్ సెకండ్ హీరోయిన్ అన్నారు కానీ ఆ పాత్రకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. దాంతో రకుల్ పని అయిపోయిందంటున్నారు. ఏ పాత్ర అయినా ఒకే అంటున్నా సీనియర్లు సైతం ఆమెకు చాన్సులు ఇవ్వకపోవడం ఘోరమే మరి. వెంకటాద్రి ఎక్స్-ప్రెస్ లో వచ్చి ఈ అమ్మడు తిరిగి రైలెక్కి వెళ్ళిపోయే టైం వచ్చిందట.

Related posts