telugu navyamedia
సినిమా వార్తలు

నేను ప్రేమించ‌బోయే వ్య‌క్తి యువ‌కుడా, వృద్ధుడా అనేది అన‌వ‌స‌రం : రకుల్

Rakul Preet Sigh images

“వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌”తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతోపాటు త‌మిళంలోనూ ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాలు త‌గ్గినా త‌మిళం, బాలీవుడ్ సినిమాల‌తో బిజీగానే ఉంది. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ స‌ర‌స‌న ఆమె న‌టించిన “దే దే ప్యార్ దే” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అజ‌య్ దేవ్‌గ‌ణ్ భార్య పాత్ర‌లో ట‌బు న‌టించింది. అత‌ని ప్రేయ‌సిగా ర‌కుల్ న‌టించింది. అజ‌య్‌కు, ర‌కుల్‌కు మ‌ధ్య పాతికేళ్ల వ‌య‌సు తేడా ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ జ‌ర్న‌లిస్ట్ నుంచి “నిజ జీవితంలో మీ కంటే వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న వ్య‌క్తిని ప్రేమిస్తారా?” అనే ప్రశ్న రకుల్ కు ఎదురైంది. దీనికి స్పందించిన ర‌కుల్ “నిజ‌జీవితంలో ప్రేమ‌లో ప‌డేందుకు నేను ఎదురుచూస్తున్నా. నేను ప్రేమించ‌బోయే వ్య‌క్తి యువ‌కుడా, వృద్ధుడా అనేది అన‌వ‌స‌రం” అని చెప్పింది.

Related posts