telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను డేటింగ్ చేయకపోవడానికి కారణం నా తమ్ముడే : రకుల్ ప్రీత్ సింగ్

Rakul-PReeth-Singh

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడుతో కలిసి ఓ‌ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. నా తమ్ముడు ఎపుడు నా నీడలా నా వెంటే ఉంటాడు. నా తమ్ముడు నన్ను ఎవరితో డేటింగ్ చేయనివ్వలేదు. స్కూల్‌లో చదువుతున్నపుడు నేను అబ్బాయిల పక్కన నిలబడితే వెంటనే ఇంట్లో మా పేరెంట్స్‌కు కంప్లైట్ చేసేవాడు. ఒకసారి నేను ప్లేట్‌లో ఏవో పెట్టుకొని ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచున్నాను. ఇక తమ్ముడు అది చూసి నేను ఆ అబ్బాయికి ఏదో తినిసిస్తున్నాని ఇంట్లో చెప్పేశాడంది. ఆ రకంగా నన్ను స్వేచ్ఛగా తిరగకుండా చేసాడు రాక్షసుడు అంటూ సరదగా నవ్వుతూ ఈ విషయాలను చెప్పింది. మరోవైపు అమన్ మాట్లాడుతూ.. నేను అక్క స్కూల్ లైఫ్‌లో ఏమి చేయనీకుండా ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో చాడీలు చెబుతూ అక్కను ముప్పతిప్పలు పెట్టాను. అపుడు అలా చేసుండాల్సింది కాదని ఇపుడు అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.సినిమాలతో పాటు జిమ్ బిజినెస్ కూడాచేస్తోంది. ప్రస్తుతం ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తన తండ్రితో కలిసి గుర్గావ్‌లోని స్లమ్ ఏరియాలో ఉన్న 250 కుటుంబాలకు రెండు పూటల అన్నం పెడుతోంది. అంతేకాదు లాక్‌డౌన్ ఎఫ్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ అన్నదానం కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.

Related posts