telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

15 మిలియన్స్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న రకుల్…!!

Rakul

ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య ఫామ్ లో లేదు. వరుసగా ప్లాపులే పలకరిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆమె ఓ తెలుగు సినిమాలో నటించనుంది. మన్మథుడు-2 తర్వాతే రకుల్ తెలుగు సినిమాల్లో నటించలేదు. వరుసగా తమిళ్, హిందీ సినిమాల్లో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. కరణం మల్లీశ్వరి బయోపిక్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. అలాగే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 మూవీతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తుంది. కాగా ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్స్ కి చేరింది. అంటే ఏకంగా ఈ అమ్మడిని కోటిన్నర మంది ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. దీనితో ఉబ్బి తబ్బిబవుతున్న రకుల్ తన అభిమానులకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts