telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు : రకుల్ ప్రీత్ సింగ్

Rakul

కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ కుదేలైంది. ముఖ్యంగా నిర్మాతలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను థియేటర్లకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. తమ సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ఓటీటీలో విడుదల చేయడాన్ని తప్పుపడుతున్నారు. అలా చేస్తే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీని గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించింది. `సినిమాలను ఏ ప్లాట్‌ఫామ్ మీద విడుదల చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ, కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది. ఎలా విడుదల చేయాలనే దాని గురించి నిర్మాతలే నిర్ణయం తీసుకోవాలి. సినిమాపై పెట్టుబడి పెట్టేది నిర్మాత. డిజటల్‌లో విడుదల చేయడమే సరైన నిర్ణయం అని నిర్మాతలకు అనిపిస్తే.. వారి కంటే బాగా నిర్ణయాలు తీసుకోగలిగిన వారెవరు?` అని రకుల్ పేర్కొంది. లాక్‌డౌన్ తర్వాతైనా జనాలు థియేటర్లకు వస్తారా? అనేది అనుమానాస్పదంగా మారింది.

Related posts