telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీడియా కథనాలు ఆపాలంటూ మరోసారి కోర్టుకెక్కిన రకుల్

Rakul

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ లతో పారు రకుల్ ప్రీత్ సింగ్ కూడా‌ ఎన్సీబీ విచారణకు హాజరైంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. తన పైన మీడియాలో వస్తున్న కథనాలను వెంటనే ఆపాలంటూ ఆమె కోర్టుకు వెళ్ళింది. తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు ముంబై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కథనాలు తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నాయని, వీటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొంది. రకుల్ వేసిన పిటిషన్ పైన ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రంతో పాటు సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఢిల్లీ హైకోర్టు మ‌ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు విచార‌ణ పూర్తయ్యే వ‌ర‌కు మీడియాలో క‌థ‌నాలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, కొంత స్వీయ నియంత్రణ పాటించాల‌ని సూచించింది. ఇక అటు రకుల్ తానూ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనను సాక్షిగా మాత్రమే NCB విచారణని పిలిచినట్టుగా వెల్లడించింది.

Related posts