telugu navyamedia
సినిమా వార్తలు

ఇలా అంటే మీరు ఊరుకుంటారా ? : రకుల్ ప్రీత్ సింగ్

Trolling on Rakul Preeth Singh Pant

నిన్న రకుల్ ధరించిన కురచ దుస్తువుల గురించి ఓ నెటిజన్ ఆమె ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయింది అంటూ కామెంట్ చేశాడు. దానికి రకుల్ మండిపడుతూ మీ అమ్మ కూడా ఇలాగే చేసి ఉంటది… అందుకే నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. నీపై వచ్చిన కామెంట్స్‌ కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?”, అసలు నువ్వు ఎలాంటి డ్రస్ వేసుకున్నావో తెలుసా ? అని నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు అంటూ రట్రోల్ చేశారు. దీంతో రకుల్ అలాంటి మాటలను వారి కుటుంబ సభ్యులపై అంటే ఎలా ఉంటుందో తెలిపేందుకే అలా అన్నానని సమాధానమిచ్చింది.

తాజాగా రకుల్ చేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది. తనను ద్వేషించిన వారికోసం ఈ ట్వీట్ అంటూ సదరు నెటిజన్ చేసిన కామెంట్ బయటపెట్టింది. ”సదరు నెటిజన్ తన ట్వీట్ ని వెంటనే తొలగించాడు. ఇప్పుడు చెప్పండి… ఇలాంటి మాటలపై మీరు కామ్ గా రియాక్ట్ అవుతారా..?” అంటూ ప్రశ్నించింది.

Related posts