telugu navyamedia
సినిమా వార్తలు

“రాక్షసుడు” మొదటివారం వసూళ్లు

Rakshasudu

“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. బి, సీ సెంటర్స్‌లో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఆదరణ బాగుంది. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న బెల్లంకొండ‌కు ఈ సినిమా హిట్ పెద్ద ఊర‌ట ఇచ్చింది. ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.96 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ వారం వరకు ఎలాంటి పోటీ లేకపోవడం గతంలో కన్న కాస్త మెరుగుగానే కలెక్షన్లు రాబట్టింది.

రాక్ష‌సుడు ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో)
నైజాం- 3.20 కోట్లు
సీడెడ్ – 1.10
ఉత్తరాంధ్ర – 1.12
ఈస్ట్ – 0.60
వెస్ట్ – 0.45
కృష్ణ – 0.60
గుంటూరు – 0.61
నెల్లూరు – 0.25
ఏపీ + తెలంగాణ = 7.93 కోట్లు

Related posts