telugu navyamedia
సినిమా వార్తలు

రాఖీ సావంత్ బాయ్ ఫ్రెండ్ ను చితకబాదిన ర్యాపర్ మేనేజర్

Rakhi Sawant's Boyfriend Deepak Kalal Beaten

బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ బాయ్ ఫ్రెండ్ దీపక్ కలాల్ ను ఢిల్లీలో నడిరోడ్డుపై పట్టుకొని ఓ వ్యక్తి చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రియాలిటీ షో కోసం వెళ్లిన దీపక్ ను ప్రముఖ ర్యాపర్ ఫజిల్ పురియా మేనేజర్ దీపక్ గురుగ్రామ్ రోడ్డు మీద ఆపి చితకబాదాడు. కలాల్ సోషల్ మీడియాలో లైవ్ లో ఈ విషయాన్నీ చెబుతుండగా దీపక్ కలుగచేసుకొని, దీపక్ కలాల్ కామెడీ జోకులు వల్గర్ గా ఉంటాయని కొన్ని వర్గాలను కించపరిచేలా ఉంటాయని ఆరోపిస్తూ అతన్ని కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందరికీ షాకిచ్చింది. అయితే ఈ వీడియోను కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఢిల్లీ పోలీసులు ఈ విషయంపై చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నారు. అయితే ఇదంతా ఫేక్ వీడియో అంటూ కొందరు మాత్రం కొట్టిపారేస్తున్నారు. గత ఏడాది నవంబర్ ;ప్ దీపక్ కలాల్, రాఖి సావంత్ పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts