telugu navyamedia
సినిమా వార్తలు

రాఖీ సావంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె ?

Rakhi-Sawanth

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్‌ చేస్తూ ఎప్పుడూ వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ తాజాగా దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫౌండేషన్ నుంచి పురస్కారాన్ని అందుకుంది. దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫౌండేషన్ పురస్కారాలు భారత ప్రభుత్వం ద్వారా అందజేసే దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుల కన్నా భిన్నమైనవి. రాఖీ సావంత్ ఈ అవార్డుల ప్రధానోత్సవంలో “బెస్ట్ ఐటమ్ డాన్సర్ ఆఫ్ బాలీవుడ్” అవార్డు అందుకుంది. ఈ నేపధ్యంలో ఆమెను కొందరు అభినందిస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెకు అవార్డు ఇవ్వడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక రిపోర్టరు ఆమెను ఈ అవార్డునుకొనుక్కున్నారా? అని ప్రశ్నించగా, తాను ఈ అవార్డుకు అర్హురాలిని అంటూ సమాధానమిచ్చింది. కాగా రాఖీ ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాఖీ సావంత్‌కు ఈ అవార్డు అందించడంపై పలు విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఆమె వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

Related posts