telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తతో కలిసి “బిగ్ బాస్” హౌజ్ లోకి హీరోయిన్…!

rakhi savanth on pulwama attack

వివాదాస్పద నటి రాఖీ సావంత్ తాను త్వరలోనే రియాలిటీ టీవీ స్టార్, ఇంటర్నెట్ సెలబ్రిటీ దీపక్‌ను పెళ్లాడనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. దీపక్‌ను తాను పెళ్లాడడం లేదని పేర్కొని సంచలనం రేపింది. తాజాగా యూకేకు చెందిన ఎన్నారై రితేశ్‌ను రహస్యంగా వివాహమాడింది. ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలను తొలుత ఖండించిన రాఖీ.. ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. ఎన్నారై రితేశ్‌ను పెళ్లి చేసుకున్నట్టు అంగీకరించింది. ఆమె అత్యంత సన్నిహితులకు తప్ప అతనెవరన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయంలో బాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఈ సస్పెన్స్‌కు తెరదించడానికి రాఖీ సిద్ధపడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. తాజాగా చేసిన ఓ ట్వీట్‌లో.. తాను తన ఎన్నారై భర్త రితేశ్‌తో కలిసి హిందీ బిగ్‌బాస్ సీజన్ 13లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించింది. ఈ షో ప్రీమియర్‌ రోజున తన భర్త ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడుతుందని తేల్చింది. తాజాగా మొదలైన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో వరుణ్-వితికా జంట కలిసి సందడి చేస్తోంది. ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొనడం తెలుగులోనే తొలిసారి. ఇప్పుడు హిందీలో రాఖీసావంత్ జోడీ కూడా ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టనుందన్నమాట.

Related posts