telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్”లోకి కాంట్రవర్సీ క్వీన్

rakhi savanth marriage news viral

వివాదాస్పద నటి రాఖీ సావంత్ తాను త్వరలోనే రియాలిటీ టీవీ స్టార్, ఇంటర్నెట్ సెలబ్రిటీ దీపక్‌ను పెళ్లాడనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. దీపక్‌ను తాను పెళ్లాడడం లేదని పేర్కొని సంచలనం రేపింది. తాజాగా యూకేకు చెందిన ఎన్నారై రితేశ్‌ను రహస్యంగా వివాహమాడింది. తాజాగా రాఖీ తన సోషల్ మీడియా పోస్టుతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో ఆమె తాను బిగ్‌బాస్-13(హిందీ) హౌస్‌లో కనిపించనున్నట్లు తెలిపారు. “నా ఫ్యాన్స్‌కు శుభవార్త. థాంక్యూ సల్మాన్‌ఖాన్. ఒక శుభవార్త మీకు చెప్పనున్నాను. ఒక ఐటమ్ సాంగ్‌తో బిగ్‌బాస్‌లో కనిపించనున్నాను. ఇంతకన్నా పెద్ద న్యూసేమీ ఉండదని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. థాంక్యూ బిగ్‌బాస్, థాంక్యూ కలర్స్ టీవీ” అని ఆ వీడియోలో రాఖీ సావంత్ పేర్కొన్నారు. కాగా రాఖీసావంత్ బిగ్‌బాస్ సీజన్-1లో పాల్గొన్నారు. అప్పుడు ఆమె షోను రక్తికట్టించడంలో కీలకంగా నిలిచారు. తరువాత చాలా సీజన్లలో గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు మరోమారు రాఖీ సావంత్ బిగ్‌బాస్‌లో కనిపించనుండడం విశేషం.

Related posts