telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్ : స్టార్ హీరో తండ్రికి కాన్సర్

Rakesh-Roshan-and-Hruthik-Roshan

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన తండ్రికి క్యాన్సర్ ఉందంటూ ప్రకటించి అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేశారు. ఈరోజు ఉదయం హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ తో కలిసి జిమ్ లో దిగిన ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి “”ఈ ఉదయం మా నాన్నతో ఓ ఫోటో తీసుకోవాలని ఉందని అడిగాను. సర్జరీ జరిగే రోజు కూడా ఆయన వ్యాయామం మానలేదు. మా నాన్న చాలా బలమైన వారు. కొద్ది వారాల క్రితం ఆయన గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇది ప్రారంభ దశలోనే ఉంది. క్యాన్సర్ పై యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరారు. ఆయన వంటి తండ్రి దొరకడం నా అదృష్టం. లవ్ యూ డాడ్” అంటూ మెసేజ్ చేశారు. ఇటీవల కాలంలో ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బింద్రే తదితరులు క్యాన్సర్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాకేష్ రోషన్ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Related posts