telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచు లక్ష్మి బీర్ తాగుతూ రోడ్డులో…  బిడ్డను కనడానికి కూడా ఇబ్బందే పాపం… రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు

Rakesh

 టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఈయన 40 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉన్నారు.. 15 వందలకు పైగా సాంగ్స్‌కి కొరియోగ్రఫీ అందించారు. సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, రామ్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు పనిచేశారు. చేతిలో సినిమాలు లేకపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్న ఈయన ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు. శ్రీరెడ్డి, శేఖర్ మాస్టర్, బాలక్రిష్ణ, ఎన్టీఆర్, ఇలా చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులపై సంచలన కామెంట్స్ చేస్తూ యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న రాకేష్ మాస్టర్ మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచులక్ష్మిపై సంచలన కామెంట్స్ చేశారు.

జూబ్లీహిల్స్‌లో అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. రేప్పొద్దున వీళ్లకు పుట్టిన పిల్లలు కూడా తాగుతారు. అదే మోడ్రన్ కల్చర్. ‘జై చిరంజీవి’ షూటింగ్ జరుగుతుంది. ఆ పక్క గల్లీలోనూ నేను చేసే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ రెండు సినిమాలకు ఒకరే మేనేజర్ కావడంతో.. చిరంజీవి సినిమా షూటింగ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం అని అలా వెళ్లా.. ఓ పెద్ద హీరో కూతురు.. పెద్ద ప్రొడ్యుసర్ కూతురు ఇద్దరూ.. నాకు వాళ్ల పేర్లు చెప్పడానికి భయం లేదు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, అశ్వనీదత్ కూతురు ఇద్దరూ బీర్లు చేతులో తాగుతూ ఉన్నారు. నేను నా కళ్లతో చూశా.. రోడ్డులో బీరుతాగుతున్నారు. ఇక్కడ మాత్రం మంచు లక్ష్మి ‘నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చును’ అంటుంది మంచు లక్ష్మి. ఆమెను మోహన్ బాబు ఎంత పద్దతిగా పెంచారో తెలుస్తోంది కదా.. నా కళ్లు ఏం దొబ్బలేదు కదా.. మంచు లక్ష్మి తాగుతూ ఉండగా.. నేను కళ్లారా చూశా. నేనే సాక్ష్యం. మేనేజర్ గోపి కూడా ఉన్నారు. ఆయన మల్లెమాల శ్యాం ప్రసాద్ స్నేహితుడు. నేను ఢీ షోకి వెళ్లడానికి ఆయనే కారణం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా.. అంటే చేయాల్సిన తప్పులను చేసేసి ఎక్కడి వాళ్లు అక్కడ బుజాలు సర్ధుకుంటున్నారు. బిడ్డను కనడానికి కూడా ఇబ్బందే పాపం. పొట్ట కోయించుకోవాలి.. నవమాసాలు మోయడం ఇష్టం లేక.. పని మనిషి పొట్టలో పెట్టేసి బిడ్డను తీసి.. హలో అంటూ ముద్దాడుతున్నారు. పుట్టిన పిల్లల స్కూల్ బ్యాగ్ ఎలాగూ పనిమనిషే మోస్తుంది కాబట్టి.. కడుపులో బిడ్డను కూడా ఆమెతోనే మోయిస్తున్నారు. నా భర్త స్పర్మ్ తీసుకుని అండంలో పెట్టుకుని నాకు బిడ్డను కని ఇచ్చెయ్ అంటున్నారు. రాజకీయ కూతుళ్లు, స్టార్ హీరోల కూతుళ్లు, ప్రొడ్యుసర్ల కూతుళ్లు ఇలాగే చేస్తున్నారు. నా దృష్టిలో సాదాసీదా వాళ్లే గొప్పవాళ్లు. అందుకే ఇలాంటి వాళ్ల కోసం నేను ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా అదే.. ‘కామా తురాణం న భయం న లజ్జ’. పెళ్లి చూపులకు శోభనం, నిశ్చితార్ధానికి ప్రెగ్నెన్సీ, పెళ్లిరోజు నాటికి సంకలో బిడ్డను చూపించబోతున్నా. నేను ఇలా చూపిస్తే ఎవరైనా వచ్చి కొడతారా ఏంటి?

నాకు మోహన్ బాబు అంటే గౌరవం ఉంది. ఆయనది మా తిరుపతి వైపే. అయినా నా కళ్లారా చూశా కాబట్టి నేను చెప్పా. నేను ఇలా అన్నా కాబట్టి మోహన్ బాబు గారు ఫోన్ చేసి.. ‘ఎవడ్రా నువ్వు.. మా కూతురు గురించి మాట్లాడటానికి ***కొడకా?’ అని అంటే.. నేను ‘నువ్ ఎవడ్రా ****కొడకా’ అని అంటా. వాడు ఎవడైనా సరే నన్ను అంటే నేను అదే స్థాయిలో స్పందిస్తా. నీకు డబ్బుంటే.. నాకు ధైర్యం ఉంది. తెగించినోడికి తెడ్డే లింగం. మోహన్ బాబు కూతురు, అశ్వనీదత్ కూతురు రోడ్డు మీద బీర్ తాగుతూ నవ్వుకుంటుండగా ‘జై చిరంజీవ’ షూటింగ్ దగ్గరకు వచ్చారు. ఆరోజు తాగేసి మంచు లక్ష్మి.. అశ్వనీదత్ కూతురుతో కలిసి ఏం చేసిందో నేను కళ్లారా చూశా. ఆ సినిమా ప్రొడ్యుసర్ అశ్వనీదత్ కావడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. ఆ టైంలో నేను చూశా. అదే చెప్పా. ఇందులో తప్పేం ఉంది.

మోహన్ బాబు నాకు వార్నింగ్ ఇస్తే.. నేను యూట్యూబ్ ఎక్కి అన్ని విషయాలు చెప్తా. ఆయనేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది? నువ్ ఎవడ్రా చెప్పడానికి అంటే.. ఆమె నాకు కనిపించింది కాబట్టి చెప్పా. దేవదాస్ సినిమాకి అమెరికా వెళ్లా. నాతో పాటు అక్కడ షూటింగ్ లొకేషన్‌లో ఉన్న వాళ్లు ఎవర్నైనా అడిగితే అక్కడ జరిగిన విషయం చెప్తారు. యూట్యూబ్ పుణ్యాన వాస్తవాలను జనానికి చెప్పే అవకాశం లభించింది. దీంతో ఈ పేదోడికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడే కాదు.. అమెరికా, దుబాయ్, లండన్, కువైట్‌లలో ఫ్యాన్స్ ఉన్నారు. నా దగ్గర డబ్బులు లేవు అంతే.. నేను ఇప్పటికీ పస్తులు ఉంటున్నా. ఎవరైనా కారు పంపితే వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నా. మొన్న ఓ రోజు తినడానికి తిండి లేక పస్తు ఉన్నా. నా భర్యను కూడా నేను డబ్బులు అడగలేదు. ఆ రోజంతా నేను పస్తు ఉన్నాను’ అంటూ తన పరిస్థితిని చెప్పుకొస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాకేష్ మాస్టర్.

Related posts