telugu navyamedia
సామాజిక

రాజ్యసభలోషార్ట్ సర్క్యూట్…మైక్ సిస్టమ్ లో పొగలు

రాజ్యసభ సమావేశాలు జరుగుతుండగా అకస్మాత్తుగా హాల్ లో పొగలు వ్యాపించాయి. సభ జరుగుతున్న వేళ షార్ట్ సర్క్యూట్ జరిగింది.  భ్యులు కూర్చున్న కుర్చీల కింద నుంచి పొగలు వచ్చాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యులంతా తమ స్థానాల నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. కాగా, సభ్యుల మైక్ కనెక్టింగ్ సిస్టమ్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పొగలు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అందరు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది

Related posts