telugu navyamedia
రాజకీయ వార్తలు

సుష్మా స్వరాజ్‌కు రాజ్యసభ సంతాపం.. ఆమె నన్ను అన్నా అని పిలిచేవారు: వెంకయ్య

Venkaiah-Naidu

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ మృతిపట్ల రాజ్యసభ నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే సుష్మా మృతిపట్ల రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. సుష్మ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ.. ఉత్తమ పార్లమెంటేరియన్‌, సమర్థవంతమైన పరిపాలకురాలు, ప్రజావాణిని గట్టిగా వినిపించే నేత సుష్మా అని కొనియాడారు.

ఆమె అకాల మరణం జాతికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె నన్ను అన్నా అని పిలిచేవారు. రాఖీ పౌర్ణమి రోజు నాకు రాఖీ కట్టేవారు. అందుకోసం నేనే స్వయంగా వారింటికి వెళ్లేవాడిని. అయితే ఇకపై రాఖీ పండుగ నాడు తానే మా ఇంటికి వస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్నారు. కాబట్టి నేనే వచ్చి రాఖీ కడతాను నాతో అన్నారు’ అంటూ సుష్మా స్వరాజ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులతో పంచుకున్నారు.

Related posts