సినిమా వార్తలు

రజిని కోసం ఉద్యోగం వదిలేశాడు..!

తాను రాజకీయాల్లోకి రానున్నట్లు రజనీకాంత్ డిసెంబర్ 31న అధికారికంగా ప్రకటించాడు. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. అభిమానులు టపాకాయలు కాల్చి , మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తన పదవికి రాజీనామా చేసి రజిని తో కలిసి రాజకీయాల్లో పనిచేయనున్నాడు.

రాజు మహాలింగం రజినీకి వీరాభిమాని.. లైకా ప్రొడక్షన్స్ వారే శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పనిచేసే సమయంలో రజినీకాంత్ భావాలకు ఫ్యాన్ అయిపోయిన రాజు మహాలింగం రజినీకాంత్ రాజకీయ జీవితంలో అతడికి తోడుగా ఉండాలని నిశ్చయించుకొని తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

 

Related posts

రోల్ రైడాను మానసికంగా బ్లాక్ మెయిల్ చేసిన తనీష్… విజేతగా నిలిచిన గీత, కౌశల్

jithu j

“కేరాఫ్ కంచరపాలెం” మా వ్యూ

vimala t

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు… అభిమానులకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ

vimala t

Leave a Comment