telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అప్పుడే నన్ను నమ్మారు… వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా .. : రజనీకాంత్

rajnikanth movie darbar look leak

తాజాగా తలైవా తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రజినీ, ఎ.ఆర్‌.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `దర్బార్‌`. సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్బార్ ఆడియో వేడుకలో రజినీ కాంత్ మాట్లాడుతూ .. నన్ను మా అనయ్య ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాడు. ఆంగ్ల మాధ్యమం కావడంతో నేను భయపడ్డాను.అన్నయ్యతో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవనని చెప్పినా ఆయన నువ్వు చదవాల్సిందేనని అన్నారు. దాంతో నేను ఏమీ చేయలేపోయాను. క్లాసులకు సరిగ్గా హాజరు కాకుండా స్నేహితులతో కలిసి సినిమాలు చూసేవాడిని. ఎగ్జామ్స్ రాయడానికి ఫీజు కట్టడానికి అన్నయ్య రూ.120లను అప్పు చేసి ఇచ్చారు. ఆ రోజు రాత్రి నేను ఇంట్లో చెప్పకుండా బెంగళూరు నుండి చెన్నై వెళుతున్న ట్రెయిన్ ఎక్కేశాను. టికెట్ తీసుకున్నాను. నిద్రలేచి అందరితో పాటు బయటకు వస్తుంటే టికెట్ కలెక్టర్ టికెట్ ఎక్కడ? అని అడిగాడు. జేబులో చూశాను. టికెట్ లేదు. ఆ విషయాన్ని ఆయనకు చెప్పాను. ఆయన నన్ను పక్కన నిలబెట్టి ఇతర ప్రయాణీకుల టికెట్స్‌ను చెక్ చేసి పంపిన తర్వాత నా దగ్గరకు వ చ్చారు. `నువ్వు టికెట్ తీసుకోలేదు కదా! నిజం చెప్పు` అన్నారు. `లేదండి.. నేను టికెట్ తీసుకున్నాను. అది పొగొట్టుకున్నాను` అని నేను ఆయనకు సమాధానం ఇచ్చాను. ఆయన నన్ను నమ్మలేదు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నాకు ఏడుపు రావడం ఒకటే తక్కువ.

ఆ సమయంలో ఐదుగురు పోర్టర్స్ మాత్రమే అక్కడున్నారు. వాళ్లు వచ్చి టికెట్ కలెక్టర్‌తో `ఆ అబ్బాయి నిజమే! చెబుతున్నాడేమో? ఒకవేళ నిజంగా ఆ అబ్బాయి టికెట్ కొనకపొతే తను కట్టాల్సిన జరిమానాని మేం కడతాం` అన్నారు. వాళ్లందరూ జేబుల నుండి డబ్బులు కూడా తీశారు. అప్పుడు నేను `లేదండీ.. నా దగ్గర డబ్బులున్నాయి` అంటూ జేబులో నుండి డబ్బులు తీశాను. ఆ డబ్బులు చూసిన తర్వాత టికెట్ కలెక్టర్ డబ్బులు ఉన్నాయంటే ఈ అబ్బాయి టికెట్ కొనే ఉంటాడు అని నమ్మి.. `తమ్ముడూ! నువ్వు టికెట్ కొన్నావని నేను నమ్ముతున్నాను` నువ్వు వెళ్లవచ్చునని అన్నారు. అలా ఆరోజు, ఆ టికెట్ కలెక్టర్‌, ఆ ఐదుగురు పోర్టర్స్ ఆ రోజు నాపై ఉంచిన నమ్మకంతోనే నేను తమిళ గడ్డపై అడుగు పెట్టాను. అలా నాకు తెలియని వాళ్లే నన్ను ముందుగా నమ్మారు. తర్వాత కె.బాలచందర్‌గారు నన్ను నమ్మారు. ఆయన నమ్మకం నిజమైంది. నాతో సినిమాలు చేసిన నిర్మాతలందరూ నమ్మకంతోనే సినిమాలు చేశారు. వారి నమ్మకాలు నిజమైయ్యాయి. ఇప్పుడు ప్రజలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. అది ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ము కాదన్నారు.

Related posts