telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా నటిస్తున్నానని అమ్మానాన్నకు చెప్పగానే… : బాలీవుడ్ హీరో

Raj-Kumar-Rao

బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ ను, గుర్తింపును సంపాదించుకున్నారు హీరో రాజ్‌కుమార్ రావు. రాజ్‌కుమార్ రావుకు ‘లవ్ సెక్స్ ఔర్ దోఖా’, ‘రాగిని ఎంఎంఎస్’ సినిమాలు లక్‌ను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో రాజ్ కుమార్ క్రేజ్ పెరిగిపోయింది. 2010లో వచ్చిన ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ అనే సినిమాతో రాజ్‌కుమార్‌కు బ్రేక్ వచ్చింది. ఇందులో నగ్నంగా నటించాలని దర్శకుడు దివాకర్ బెనర్జీ చెప్పినప్పుడు తప్పకుండా నటిస్తానని ఒప్పుకున్నాడట. సినిమా కోసమే కాబట్టి ఒప్పేసుకున్నాడు కానీ తన తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాడట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “నగ్నంగా నటించబోతున్నానని నా తల్లిదండ్రులతో చెప్పాలనుకున్నాను. ఏదైతే అదైంది అనుకుని వెళ్లి ధైర్యంగా నాకో సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పాను. వారు చాలా సంతోషించారు. కాకపోతే సినిమాలో నగ్నంగా నటించాల్సిన సన్నివేశాలు ఉన్నాయని చెప్పాను. దాంతో వారు షాకయ్యారు. ఆ తర్వాత వారిని ఎలాగైనా కన్విన్స్ చేయాలనుకున్నాను. నా ముందు భాగం ఎవ్వరికీ కనిపించదు. కేవలం వెనక భాగం మాత్రమే చూపించాలి అని చెప్పాను. అప్పుడు వారు ఓకే అనుకున్నారు. ఎందుకంటే ఇదంతా సినిమాలో భాగమే. అది కూడా నటనే. ఆ తర్వాత ఈ టాపిక్ గురించి వారు నాతో ఎప్పుడూ చర్చించలేదు. ఆ తర్వాత షాహిద్, ఒమర్టా అనే సినిమాల్లోనూ నేను నగ్నంగా నటించాను. ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాలని నేను సినిమాల్లోరి రాకముందు నుంచే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే హీరో అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎక్కువగా బయట తిరిగేవాడిని. అందరితో గొడవలు పడుతుండేవాడిని. హీరోగా ఫైట్లు చేసేవాడిని. కావాలనే గొడవలు పెట్టుకుని ఫైట్లకు దిగేవాడిని. కాకపోతే నేను గూండా కాదనుకోండి. జస్ట్ ఫిల్మీ కిడ్ అంతే” అని చెప్పుకొచ్చాడు రాజ్‌కుమార్ రావు. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడ్ ఇన్ చైనా’ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ ‘తుర్రం ఖాన్’, ‘రూహీ అఫ్జా’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related posts