telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ కు గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌

rajinikanth on loksabha election support

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్స‌వాలు ప్ర‌తి ఏడాది గోవాలో ఘనంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో ప‌లు చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు కొంద‌రు ప్ర‌ముఖుల‌ని అవార్డుల‌తో స‌త్క‌రించ‌నున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 20 నుండి 28వ‌ర‌కు 50వ ఇఫి వేడుక‌లు గోవాలో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో 250కి పైగా సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకోనున్నాయి.. ఈ వేడుక‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌తో సత్కరించ‌నున్నారు. ఈ విష‌యాన్ని బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట‌ర్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. త‌న‌కి ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌ గౌర‌వం అందించినందుకు ర‌జ‌నీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు. కాగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫ్రెంచ్ యాక్ట‌ర్ ఇసాబెల్లె హ‌ప్ప‌ర్ట్‌కి అందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

Related posts