telugu navyamedia
telugu cinema news trending

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్

petta in sankranti movie race

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం “పెట్టా”. ఈ చిత్రంలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రజినీ, త్రిష లుక్ విడుదలైంది. ఈ లుక్ లో రజినీకాంత్ స్టైల్, చీరకట్టులో త్రిష అందంగా ఉందనే టాక్ వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో వేడుక జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రల్లో కన్పించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. “పేట” పేరుతో తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ నెల 28న చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఇక ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటి వారంలో భారీగా నిర్వహించనున్నారు.

Related posts

కౌశల్ ఆర్మీ వార్ రివర్స్… స్పందించిన కౌశల్

vimala p

ఈపీఎస్-95 .. ఇకనుండి కనీస పింఛన్ 3వేలు.. కేంద్రం తాయిలం.. !!

vimala p

ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, అశ్విన్ గంగ‌రాజు, కాల‌భైర‌వ కాంబినేష‌న్ మూవీ `ఆకాశ‌వాణి`..90 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి

ashok