telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రజిని పార్టీ పేరు ఇదేనా..?

గతంలో చాలా మంది సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి మంచి పేరు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.  సొంతంగా పార్టీని పెట్టి 2021లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  రజినీకాంత్ కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.  ఈనెలాఖరున పార్టీని ప్రకటించబోతున్నారు.  అయితే, రజినీకాంత్ పార్టీకి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  రజినీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి అని ప్రచారం జరుగుతున్నది  ఇక రజినీకాంత్ పార్టీకి ఆటో గుర్తు కేటాయించారని సమాచారం.  మక్కల్ సేవై కర్చి అంటే ప్రజాసేవ పార్టీ అని అర్ధం.  రజినీకాంత్ బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించారు.  ఆ సినిమా సూపర్ హిట్టైంది.  రజినీకాంత్ పార్టీ గుర్తు ఆటో అని సోషల్ మీడియాలో లీక్ కావడంతో తమిళనాడులో ఆటో సింబల్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.  అభిమానులు బాషా లోని రజినీకాంత్ ఆటో ఫోటోలను పోస్టు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  మరి చూడాలి రజిని ఇందులో ఎంత మేర విజయం సాధిస్తారు అనేది.

Related posts