telugu navyamedia
రాజకీయ

నేనెవరికీ మద్దతు ఇవ్వను.. సమస్యలను పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి..: రజనీకాంత్

rajinikanth on loksabha election support

రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించడమే కానీ, ఇంతవరకు దానికి సంబందించిన ప్రకటన లేకపోవటంతో రజనీకాంత్ వచ్చే ఎన్నికలలో పోటీకి సన్నద్ధం అయినట్టుగా కనిపించడం లేదు. దీనితో కనీసం ఆయన పేరు మరియు మద్దతు ను ఆశిస్తున్న వారికి కూడా ఒక స్పష్టత ఇచ్చారు. తానెవరికీ మద్దతు ఇవ్వబోనని; అలాగే తనపేరును కూడా ఏ పార్టీ వాడుకోరాదని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇటీవల భారతీయ జనతా పార్టీతో పాటు అన్నాడీఎంకే పార్టీలు సినీ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరిన విషయం తెలిసిందే.

నిజానికి ర‌జ‌నీకాంత్ కొన్నాళ్ళ క్రితం తాను రాజ‌కీయాల‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించ‌ని ర‌జ‌నీకాంత్ రానున్న లోక్‌స‌భ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తాడా? లేదా? అనే దానిపై అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. “నా పేరు, గుర్తు ఎవ‌రు వాడ‌కూడ‌దు. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే బ‌ల‌మైన‌, సుస్థిర ప్ర‌భుత్వాన్ని ఎంచుకోండి” అని తలైవా పిలుపునిచ్చారు.

Related posts