telugu navyamedia
telugu cinema news

రజినీకాంత్ పొలిటికల్ థ్రిల్లర్… మురుగదాస్ దర్శకత్వంలో…

rajinikanth-and-murugadoss

సూపర్ స్టార్ రజనీకాంత్ దూకుడుగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ‘కబాలి’ సినిమా చేసిన ఆయన ఎక్కువ సమయం తీసుకోకుండా ‘కాలా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘కాలా’ను మరిచిపోకమునుపే, అంతకుముందు ఆయన చేసిన ‘2.ఓ’ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా సందడి థియేటర్లలో కొనసాగుతూ ఉండగానే, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన ‘పెట్టా’ సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఏడాది సమయంలో ‘కాలా’ సినిమాతో పాటు ‘పేట్టా’ సినిమాను కూడా పూర్తి చేశాడు.

ఈ సినిమా తరువాత ఇక రజనీ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తన తదుపరి సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కథపై కసరత్తు పూర్తి చేసిన మురుగదాస్, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలోనే ఉంటుందనీ …ప్రజలను ప్రభావితం చేసేలా ఉంటుందని అంటున్నారు. సన్ పిక్చర్స్ వారే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని చెబుతున్నారు. సినిమాకు లెజండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పని చేయనున్నారు. గతంలో రజినీకాంత్, సంతోష్ శివన్ కాంబినేషన్ లో ‘దళపతి’ సినిమా వచ్చింది. మళ్లీ ఇంత కాలానికి వీరిద్దరూ కలిసి పని చేస్తుండడం విశేషం.

Related posts

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 1న అల్లు శిరీష్ ఏబిసిడీ గ్రాండ్ రిలీజ్

vimala p

దీపికా మాజీ ప్రియుడి గురించి రణ్వీర్ కామెంట్స్

ashok

పవన్ కొత్త లుక్ వైరల్

vimala p